TGTET January 2026 Notification:తెలంగాణలో టీచర్ అవ్వాలనుకునే అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్!
స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్, తెలంగాణ ప్రభుత్వం TGTET–January 2026 (Teacher Eligibility Test) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది

ఈ సారి పరీక్ష పూర్తిగా Computer-Based Test (CBT) రూపంలో జరగనుంది. 2026 జనవరి 3 నుంచి 31 మధ్య పరీక్షలు ప్లాన్ చేశారు.
అర్హతలు, ఆన్‌లైన్ అప్లికేషన్, ఫీజులు, పరీక్ష తేదీలు, సిలబస్ వివరాలు, పాస్ మార్కులు, వెయిటేజ్, హాల్ టికెట్ తేదీలు అన్నీ ఇక్కడ ఉన్నాయి.
-
పరీక్ష మోడ్: CBT (Computer-Based Test)
-
పరీక్ష తేదీలు: 03.01.2026 – 31.01.2026
-
అప్లికేషన్ తేదీలు: 15.11.2025 – 29.11.2025
-
హాల్‌టికెట్లు: 27.12.2025 నుండి
-
ఫలితాలు: 10.02.2026 – 16.02.2026 మధ్యలో
-
ఆఫిషియల్ వెబ్‌సైట్:
-
వెయిటేజ్: TRT (Teacher Recruitment Test) లో TET కు 20% weightage ఉంటుంది.
Teacher Eligibility Test (TET) అనేది క్లాసులు 1 నుండి 8 వరకు టీచర్ గా పనిచేయడానికి తప్పనిసరి అర్హత. Right to Education Act (RTE) ప్రకారం, ఎవరైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ aided/unaided స్కూళ్లలో టీచర్‌గా పని చేయాలంటే తప్పనిసరిగా TET పాస్ కావాలి
నోటిఫికేషన్ ప్రకారం, ఈ క్రింది అభ్యర్థులు అప్లై చేయొచ్చు.
-
D.El.Ed / D.Ed / B.Ed / Language Pandit కోర్సులు పూర్తి చేసినవారు
-
ఈ కోర్సుల ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు
-
మునుపటి TET పాస్ అయ్యి స్కోర్ మెరుగుపరచుకోవాలనుకునేవారు
పరీక్ష రెండు పేపర్లలో జరుగుతుంది.
Paper-I
-
Classes 1 to 5 కి టీచర్ కావాలనుకునే వాళ్లకు
-
Classes 6 to 8 కి టీచర్ కావాలనుకునే వాళ్లకు
I–VIII classes teacher కావాలంటే Paper-I & Paper-II రెండింటిని రాయాలి.
నోటిఫికేషన్ ప్రకారం:
-
ప్రభుత్వ & ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు కూడా ఈ పరీక్ష రాయొచ్చు.
-
SGT/LFL HM → Paper-I రాయొచ్చు
-
School Assistants, Language Pandits, High School HMs → Paper-II రాయొచ్చు
పరీక్షలు 2026 జనవరి 3 నుండి జనవరి 31 మధ్య జరిగే అవకాశం ఉంది.
| సెషన్ | టైమింగ్ |
|---|---|
| ఉదయం సెషన్ | 09:00 AM – 11:30 AM |
| మధ్యాహ్నం సెషన్ | 02:00 PM – 04:30 PM |
“KALYANA LAXMI గురించి తెలుగులో తెలుసుకోవాలి అనుకుంటున్నారా?” అయితే
నోటిఫికేషన్ ప్రకారం ఫీజులు ఇలా ఉన్నాయి
Notification TGTET-Jan-2026:
-
Paper-I లేదా Paper-II మాత్రమే: ₹750
-
రెండు పేపర్లు రాస్తే: ₹1000
-
ఫీజు చెల్లింపు తేదీలు: 15.11.2025 – 29.11.2025
అప్లికేషన్ పూర్తిగా ఆన్‌లైన్ లో మాత్రమే చేయాలి.
-
అప్లికేషన్ తేదీలు: 15.11.2025 – 29.11.2025
-
అప్లై వెబ్‌సైట్: schooledu.telangana.gov.in
-
డీటైల్ నోటిఫికేషన్ & ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా అదే వెబ్‌సైట్‌లో ఉచితంగా లభిస్తుంది.
అభ్యర్థులు డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వొచ్చు.
కానీ ఫైనల్ అలోట్మెంట్ మాత్రం Convenor నిర్ణయం ఆధారంగా ఉంటుంది — ప్రతి డిస్ట్రిక్ట్‌కి ఉన్న సీటింగ్ సామర్థ్యాన్ని బట్టి మారొచ్చు .
నోటిఫికేషన్ ప్రకారం పాస్ మార్కులు ఇలా ఉన్నాయి
Notification TGTET-Jan-2026:
| Category | Pass Percentage |
|---|---|
| General / EWS | 60% & above |
| BC | 50% & above |
| SC / ST / Differently Abled | 40% & above |
సూపర్ న్యూస్!
TGTET 2026 సర్టిఫికేట్ లైఫ్ టైమ్ వాలిడిటీతో వస్తుంది. ఎలాంటి renew అవసరం లేదు .
-
భవిష్యత్తులో జరిగే Teacher Recruitment Test (TRT) లో
TET స్కోర్‌కు 20% weightage ఉంటుంది -
అంటే TET స్కోర్ మంచి ఉంటే TRT లో నీ ర్యాంక్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది.
ఈ తేదీలను మిస్ అవ్వకండి! (నోటిఫికేషన్ టేబుల్ ద్వారా పూర్తిగా సర్టిఫైడ్)
| Activity | Dates |
|---|---|
| Notification విడుదల | 14.11.2025 |
| ఇన్ఫర్మేషన్ బులెటిన్ | 15.11.2025 నుండి |
| Fees Payment | 15.11.2025 – 29.11.2025 |
| Online Application | 15.11.2025 – 29.11.2025 |
| Hall Tickets | 27.12.2025 నుండి |
| Exam Dates | 03.01.2026 – 31.01.2026 |
| Results | 10.02.2026 – 16.02.2026 |
TGTET January 2026 నోటిఫికేషన్ తెలంగాణ టీచర్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది అభ్యర్థులకు ఒక పెద్ద అవకాశం. లైఫ్ టైమ్ వాలిడిటీ, CBT మోడ్, TRP లో 20% weightage వంటి బెనిఫిట్స్ వలన ఈ పరీక్ష ప్రాముఖ్యత మరింత పెరిగింది.
ఇప్పుడే సిలబస్ డౌన్‌లోడ్ చేసుకుని, ప్రిపరేషన్ స్టార్ట్ చేయు. డెడ్లైన్స్ మిస్ అయితే తర్వాత పశ్చాత్తాపం తప్పదు.


